ఏందయ్య సామీ..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ ‘రణబాలి’ మూవీ టీమ్ ఈ చిత్రంలోని బ్యూటిఫుల్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో విజయ్ టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాలో నాయకానాయికల పెళ్లి వేడుక సందర్భంగా ఓ పాట చిత్రీకరించారు. అప్పట్లో పెళ్లి సందడి ఎంత సంప్రదాయంగా ఉండేదో ఈ గీతంలో చూపించారు. ‘ఏందయ్య సామీ.. ఇంత కాస్తాందీ వెన్నెల, ఊపేస్తావుంది సిత్తరాల ఉయ్యాలా.. వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు.. మారే జాముకి మందుపెట్టిందెవ్వరు.. మాయదారి మనస్సాగక జాగారమన్నారా..’ అంటూ సాగుతుందీ గీతం.
మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ అతుల్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా.. శ్వేతా మోహన్, అజయ్ ఆలపించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్‌కు రాబోతోంది. ఈ చిత్రానికి సమర్పణ: గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్, టీ సిరీస్ ఫిలింస్; సంగీతం: అజయ్ డీవోపీ: నీరవ్ షా; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్; ఆర్ట్: విఠల్ కోసనం.




