అడ్డగోలుగా ఓట్ల తొలగింపు
మన దేశంలో ప్రతీ ఎన్నికల సందర్భంలో ఓటర్ల జాబితాలో నుంచి పేర్ల తొలగింపు లేదా జాబితాలో అత్యధిక ఓట్లు చోటు చేసుకోవడం వివాదాస్పదంగా మారుతూ వస్తుంది. అనేక మందికి ఓటరు ఐడీ కార్డులున్నప్పటికీ జాబితాలో పేర్లు లేకపోవడంతో ఓటేసే అర్హతను కోల్పోతున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపు మన ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. బీహార్‌లో ఎస్‌ఐఆర్ సవరణతో అడ్డగోలుగా ఓట్లు తొలగించడం సరైనది కాదు.
ఫలితంగా ప్రతిపక్షాలు ‘ఓట్ చోరీ’ పేరుతో నినాదాలు, నిరసనలు చేయడం ఎన్నికల సంఘం వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తుంది. ఓట్ల తొలగింపుకు శాస్త్రీయ పద్ధతి లేకుండా, అడ్డగోలుగా తొలగించడం అవమానీయం. ఎన్నికల సంఘం ఎన్నికలను సజావుగా సాగించడంపై పెడుతున్న శ్రద్ధ, ఎన్నికల జాబితాలో అవకతవకలు లేకుండా చూడటంపై దృష్టి సారిస్తే బాగుంటుంది. త్వరలో తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మరి ఇక్కడ ఎంతమంది ఓటర్లు జాబితా నుంచి తమ ఓటును కోల్పోతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వెంకటరమణ, సికింద్రాబాద్






