28 June, 2026 | 3:46 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

పుదుచ్చేరి సీఎంగా ఎన్. రంగస్వామి.. 5వ సారి ప్రమాణ స్వీకారం

13-05-2026 10:27 AM

పాండిచ్చేరి: సీనియర్ రాజకీయ నాయకుడు, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్(All India N. R. Congress) వ్యవస్థాపకుడు ఎన్. రంగస్వామి బుధవారంనాడు ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. AINRC నేతృత్వంలోని NDA ప్రభుత్వంలో, మరో ఇద్దరు మంత్రివర్గ సభ్యులు ప్రాంతీయ పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, BJPకి చెందిన A. నమశ్శివాయం కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాష్‌నాథన్(Lieutenant Governor K. Kailashnathan), ముఖ్యమంత్రికి, ఆయన మంత్రివర్గ సహచరులకు పదవీ ప్రమాణం చేయించారు. రంగస్వామి దైవసాక్షిగా ప్రమాణం చేశారు.  మల్లాడి కృష్ణారావు తెలుగులో ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పుదుచ్చేరి ప్రాంతమైన యానంకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 18 స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హాజరయ్యారు.