మహారాష్ట్రలో కూలిన శిక్షణ విమానం
ముంబై: అజిత్ పవార్‌తో సంబంధం ఉన్న విమాన ప్రమాదం జరిగిన కొన్ని నెలలకే మహారాష్ట్రలోని బారామతిలో శిక్షణ విమానం కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, బుధవారం నాడు బారామతిలోని గోజుబావి గ్రామంలో ఒక రెండు సీట్ల శిక్షణా విమానం కూలిపోయింది. 'రెడ్‌బర్డ్ ఏవియేషన్' సంస్థకు చెందిన ఈ విమానం గోజుబావి గ్రామ పరిధిలోనే కూలిపోవడంతో స్థానిక అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టారు. శిక్షణ పొందుతున్న పైలట్ క్షేమంగా ఉన్నారని, ఈ ఘటనలో పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని పూణే రూరల్ పోలీస్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపాయి. అయితే ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న బారామతి తాలూకా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.






