11 April, 2026 | 1:49 AM

రావు బహదూర్ రాగాలు

11-04-2026 12:02 AM

సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ‘రావు బహదూర్’. వెంకటేశ్ మహా దర్శకుడు. ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్‌చంద్ర నిర్మిస్తున్నారు. హీరో మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్‌ల జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదలై, మంచి స్పందన దక్కించుకుంది. ఇప్పుడు టీమ్ మ్యూజిక్ ప్రమోషన్స్‌కు సిద్ధమవుతోంది. తొలిగీతం ‘ఓ సుందరి’ ఏప్రిల్ 15న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి; సినిమాటోగ్రఫీ: కార్తిక్ పరమార్; ప్రొడక్షన్ డిజైన్: రోహన్ సింగ్.