30 March, 2026 | 1:31 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

మెట్రో కారిడార్లలో వేగంగా సర్వే

17-02-2025 01:15 AM

* నెలాఖరుకు మేడ్చల్, శామీర్‌పేట్ రూట్లలో టాఫిక్ సర్వే, భూ సామర్థ్య పరీక్షలు పూర్తి

* హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): మేడ్చల్, శామీర్‌పేట్ మెట్రో కారిడార్లలో ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్య పరీక్షలు వేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తి చేయబోతున్న ట్టు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జేబీఎస్ మేడ్చల్ (24 కిలోమీటర్లు), జేబీఎస్ (21 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లకు డీపీఆర్‌ల తయారీ కోసం అవసరమైన సర్వే పనులు సాగుతున్నాయని వెల్లడిం చారు.

ట్రాఫిక్ సర్వేలో భాగంగా ప్రస్తుతం ఈ కారిడార్‌లో రోజువారీ ప్రయాణీకుల సంఖ్య, భవిష్యత్  అంచనాలుంటాయని పేర్కొన్నారు. జంక్షన్ల వద్ద ప్రయాణికులు, వివిధ ప్రాంతాల్లో ఉన్న మలుపులు, పాదచారుల సంఖ్య, వాహనాల్లో ప్రయాణించే వారికి పట్టే సమయం, వారిలో మెట్రో రైలుకు మారే వారెందరు, వివి ధ మెట్రోస్టేషన్లు ఏర్పాటయ్యే ప్రాంతాల్లో ప్రయాణికుల సాంద్రత వంటి అంశాలు పరిశీలిస్తామని చెప్పారు.

సామాన్యంగా ప్రతి అర కిలోమీటర్‌కి ఒక బోర్‌వెల్ చొప్పున భూసామర్థ్య పరీక్షల నమూనాలు తీసుకుంటామని, ఒక్కో బోర్‌వెల్‌ను యాభై వంద అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి, భూమి గట్టిదనం, రాతి పొరలను పరిశీలిస్తామని చెప్పారు. ఇప్పటికే హెచ్‌ఎండీఏ , జాతీయ రహదారుల సంస్థ వారు కొన్ని భూ సామర్థ్య అధ్యయనాలు చేపట్టడం వల్ల, తాము- మేడ్చల్ మార్గంలో 25 చోట్ల, జేబీఎస్ మార్గంలో 19 చోట్ల  భూసామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటిలో మేడ్చల్ మార్గంలో 14 చోట్ల, శామీర్‌పేట్ మార్గంలో 11 చోట్ల ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయని,  మార్చి వరకు -ఫ్యూచర్ సిటీ సహా ఈ రెండు మెట్రో మార్గాల డీపీ ఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు.