12 July, 2026 | 3:53 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

వేగంగా తరిగిపోతున్న విదేశీ మారక నిల్వలు

26-10-2024 12:00 AM

మరో 2.163 బిలియన్ డాలర్ల తగ్గుదల 

 న్యూఢిల్లీ, అక్టోబర్ 25:  దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు రికార్డు గరిష్ఠస్థాయి నుంచి వరుసగా మూడో వారమూ తగ్గా యి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గ ణాంకాల ప్రకారం  అక్టోబర్ 18తో ముగి సిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు మరో 2.163 బిలియన్ డాలర్లు తగ్గి 688.267 బిలియన్ డాలర్ల వద్ద నిలి చాయి.

అంతక్రితం అక్టోబర్ 11తో ముగిసిన వారంలో ఇవి  10.644 బిలియన్ డాలర్లు తగ్గాయి. అంతక్రితం వారం ఇవి 3.7 బిలి యన్ డాలర్ల మేర క్షీణించాయి. సెప్టెంబర్ చివరినాటికి ఫారెక్స్ నిల్వలు 704.885 బిలి యన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.  వరుస మూడు వారాల్లో 16 బిలియన్ డాలర్లకుపైగా క్షీణించాయి. 

పెరిగిన బంగారం నిల్వలు

ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు  సమీక్షావారంలో  67.444  మిలియన్ డాలర్లు పెరిగి 67.444 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 68 మిలియన్ డాలర్లు తగ్గి18.271 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు 16 మిలియన్ డాలర్ల క్షీణతతో 4.316 బిలియన్ డాలర్ల వద్దకు తగ్గాయి.