12 July, 2026 | 2:54 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

రూ.665 కోట్లకు పెరిగిన సత్య నాదెళ్ల ప్యాకేజి

26-10-2024 12:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేతనం గణనీయంగా పెరిగింది. 2024 సంవత్సరంలో నాదెళ్లకు చెల్లించిన  63 శాతం వృద్ధితో 79.103 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.665 కోట్లు) పెరిగినట్లు మైక్రోసాఫ్ట్ తాజాగా యూఎస్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషన్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపింది. 2023లో 48.5 మిలియన్ డాలర్ల (రూ.407 కోట్లు) ప్యాకేజి నాదెళ్ల అందుకున్నారు.

తాజాగా లభించిన 79.106 మిలి యన్ డాలర్ల ప్యాకేజిలో జీతం రూపంలో 2.5 మిలియన్ డాలర్లు లభించగా, ప్రధాన భాగం 71.24 మిలియన్ డాలర్ల విలువైన మైక్రోసాఫ్ట్ షేర్లు అందాయి. మరో 5.2 మిలియన్ డాలర్లు ప్రోత్సాహకంగా, 1,69,791 డాలర్లు ఇతర పరిహారంగా లభించాయి. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులైన తర్వాత సత్య నాదెళ్లకు లభించిన అత్యధిక ప్యాకేజి ఇదే.