27 June, 2026 | 7:07 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

ఆదివాసీ మహిళకు అరుదైన పురస్కారం

04-03-2026 12:00 AM
  1. ఆదివాసీ మహిళలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర

శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ మండలి చైర్మన్ కత్తిమండ ప్రతాప్ 

చర్ల, మార్చి 3 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని తేగడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న తుర్రం. జ్యోతి  మహిళా కీర్తి రత్న జాతీయ అవార్డు అందుకున్నారు  విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో శ్రీ, శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ చేతుల మీదుగా అవార్డును ఆమె కు అందజేసి కిరీటం పెట్టి శాలువాతో ఘనంగా సత్కరించి మెమెంటో అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ మహిళలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడంలో ఇప్పపువ్వ లడ్డు తయారీ వంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఆమె కీలక పాత్ర పోషించిందని, మరోపక్క ఉపాధ్యాయ వృత్తిలోనూ విద్యార్థుల భవిష్యత్తుకై ఆమె కృషి ఎనలేనిదని ఆమె ఇంకా మరెన్నో అవార్డులను అందుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అవార్డును అందుకున్న తుర్రం.

జ్యోతి మాట్లాడుతూ విద్యారంగం, గిరిజన మహిళ అభివృద్ధి, సేవా రంగంలో నేను చేసిన కృషిని గుర్తించి శ్రీ శ్రీ కళావేదిక అవార్డు ఇవ్వడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అవార్డుకి ఎంపిక చేసిన సీఈ.ఓ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం లకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.