బీజేపీ రాష్ట్ర చీఫ్‌కు మాజీ మేయర్ హోలీ శుభాకాంక్షలు
04-03-2026 12:00 AM
సికింద్రాబాద్, మార్చి ౧ (విజయక్రాంతి): బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నివాసంలో హోలీ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి రామచందర్రావును మంగళవారం కలిసి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి కొంతసేపు రంగులు చల్లుకొని, స్వీట్లు తినిపించుకొని హోలీ పండుగ సందడి చేశారు. ఈ సందర్భంగా కార్తీక రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంట ఆనంద కాంతులు విరజి మ్మాలని ఆకాంక్షిస్తూ, హిందూ కుటుంబ సభ్యులందరికీ బండ కార్తీక చంద్రారెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.




