01-09-2025 08:27:19 AM
యాదగిరిగుట్టకు అంతర్జాతీయ గుర్తింపు
హైదరాబాద్: యాదగిరిగుట్ట(Yadagirigutta) సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యాదగిరిగుట్ట ఆలయ సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ(Canadian Prime Minister Mark Carney) అభినందించారు. యాదగిరిగుట్ట ఆలయ నిర్వాహకులకు కెనడా ప్రధాని లేఖ రాశారు. కెనడా ఒట్టవాలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కల్యాణాన్ని అభినందిస్తూ లేఖ రాశారు. హిందూ సంస్కృతి ఆధ్యాత్మికత, ఐక్యతను కెనడా ప్రధాని ప్రశంసించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ లేఖపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha), ఈవో వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 27 వరకు కెనడాలోని 4 రాష్ట్రాల్లో స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. స్వామివారి సేవలను భక్తులకు మరింత విస్తృతం చేస్తామని ఈవో వెంకట్రావు తెలిపారు.