01-09-2025 01:39:15 AM
-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య
-బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి
-రాష్ట్ర మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
-కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్‌లో పడుకోవడానికేనా ఓట్లేసి గెలిపించింది
-సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే.నారాయణ
- బీసీలు పోరాటం ద్వారా రాజ్యాంగబద్ధంగ రిజర్వేషన్లు సాధించాలి
- హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
ముషీరాబాద్, ఆగస్టు 31(విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సాధించిన స్ఫూర్తితోనే చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమిస్తామని జాతీ య బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇదే చివరి పోరాటమని, బిసిలకు రాష్ట్ర ప్రభు త్వం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీసుకువచ్చిన బిల్లును ఎవరైనా వ్యతిరేకిస్తే సహించేది లేద ని, రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు.
బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీన ర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్ అధ్యక్షతన ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ‘బీసీల యుద్ధభేరి’ సభ లో ఆయన ప్రసంగించారు. కోర్టుకు ఏవరు వెళ్ళరాదని, ఏవరైన వెళితే పోరాడి విజయం సాధిస్తామన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేలాది హాస్టల్స్, గురుకుల రెసిడెన్షియ ల్ పాఠశాలలు, స్కాలర్షిప్‌లు, ఫీజుల రీయంబర్స్‌మెంట్ పథకాలను సాధించడం జరిగిం దని, ఈ పథకాలన్నీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఫీజుల రీయంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఎత్తివేస్తే సహించేది లేదని హె చ్చరిం చారు. ఎమ్మెల్సీ, రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనా చారి మాట్లాడుతూ దోపిడి, అన్యాయం, అణిచివేతకు గురైన బిసిలు రాజ్యాధికారం సాధించా లని, ఇది సాధ్యం కావాలంటే బిసిలంతా ఐక్యంగా ఉండి బిసిలకే ఓట్లు వేయాలని సూచించారు. 56 శాతం ఉన్న బిసిలు రాజ్యాధికారంలో లేకపోవడం దారుణమన్నారు.
ఆర్. కృష్ణయ్య తన జీవితాన్ని బిసిలకే అంకి తం చేశారని, ఆయన వెంట ఉండి రాజ్యాధికారం సాధించాలన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే.నారాయణ మాట్లాడుతూ ఒక శాతం జనాభా ఉన్నవారు రాజ్యాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో బిసి బిల్లు ప్రవేశపెడు తుంటే మాజీ సీఎం కేసిఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌజ్‌లో పడుకోవడానికేనా ఓటర్లు గెలిపించిందని ప్రశ్నించారు. బీసీలు చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధించేంతవరకు వారి వెంట సీపీఐ ఉం టుందన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి సాధించాలన్నారు. మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోదీ జనగణనలో కులగణన చేపడుతున్నారని, స్థానిక సంస్థల్లో, చట్ట సభల్లో బిసిలు పోరాటం ద్వారా రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లు సా ధించాలని పిలుపునిచ్చారు. ఇందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అలాగే బిసిలకు ప్రత్యేకంగా మంత్రి త్వ శాఖ ఉండాలన్నారు.
ఈ సభలో జాతీ య బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెం ట్ నీల వెంకటేష్ ముదిరాజ్, జాతీయ ప్ర ధాన కార్యదర్శి కోలా జనార్ధన్ గౌడ్, డాక్టర్ పురుషోత్తం, వేముల రామకృష్ణ, పి. సుధాకర్, భరత్ గౌడ్, శ్రావణి, విజయ్, చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొనగా కళాకారుడు రామలింగం బృందం పాడిన పాటలు సభికులను ఎంతగానో ఉత్తేజపరిచాయి.