01-09-2025 09:01:14 AM
హైదరాబాద్: గౌలిగూడ పరిధిలో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. జాంబాగ్ లోని భవనం(Jambagh Building) మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న 18 మందిని సురక్షితంగా బయటకు తెచ్చారు. భవనంలో మంటలను పూర్తిగా అదుపుచేసినట్లు ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.