17 April, 2026 | 3:23 AM

అపోలో దవాఖానలో అరుదైన ఆపరేషన్

17-04-2026 01:29 AM

10 గంటల ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విజయవంతం

హైదరాబాద్, ఏప్రిల్ 16(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి వైద్యు లు అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి ‘పల్మనరీ ఆల్వియోలార్ ప్రోటీనోసిస్ (పీఏపీ)’తో బాధపడుతున్న 38 ఏళ్ల రోగిపై అత్యంత క్లిష్టమైన ‘వోల్ లంగ్ లావేజ్ (డబ్ల్యూఎల్‌ఎల్)’ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు.

సుమారు 10 గంటల పాటు సాగిన ఈ చికిత్సలో రెండు ఊపిరితిత్తులను దాదాపు 30 లీటర్ల గోరువెచ్చని ద్రావణంతో శుభ్రపరిచారు. ఈ విధానం ద్వారా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన ప్రోటీన్ పదార్థాన్ని తొలగించి శ్వాసక్రియను మెరుగుపరుస్తారు. ఈ ప్రక్రియను ప్రముఖ ఇంటర్వెన్షనల్ పుల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంచెట్టి నేతృత్వంలో వైద్య బృందం అనస్థీషియా విభాగానికి చెందిన డాక్టర్లు రవికాంత్ వం గూరి, మాధవ్, యు. శ్రీనివాస్, పుల్మనాలజీ విభాగానికి చెందిన డాక్టర్లు ఎన్. సౌజన్య, శ్రీచరణ్, నీలేష్ గుట్టికొండలతో కూడిన బ హుళ విభాగాల వైద్య బృందం సమన్వయంతో ఈ క్లిష్ట ప్రక్రియను విజయవంతం గా పూర్తి చేశారు.

చికిత్సకు ముందు రోగికి నిమిషానికి 6 లీటర్ల ఆక్సిజన్ అవసరం కాగా, శస్త్రచికిత్స అనంతరం అది 1 లీటర్‌కు తగ్గడం విశేషం. దీంతో రోగి ఊపిరితిత్తుల పనితీరు గణనీయంగా మెరుగుపడి నట్లు వైద్యులు తెలిపారు. పుల్మనరీ చికిత్సలలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా భావించే వోల్ లంగ్ లావేజ్ విజయవంతంగా నిర్వహించడం ఆసుపత్రి వైద్య నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంచెట్టి మాట్లాడుతూ, ఇలాంటి క్లిష్టమైన చికిత్సలకు ఖచ్చితమైన ప్రణాళిక, సమన్వ యం మరియు నైపుణ్యం అవసరం. అరుదైన ఊపిరితిత్తుల వ్యాధులకు ఆధునిక చికిత్సలు అందించడంలో మా బృందం నిబద్ధతను ఇది చాటుతోంది అని పేర్కొన్నారు. ఈ సం దర్భంగా అపోలో హాస్పిటల్స్ తెలుగు రాష్ట్రాల సీఈఓ తేజస్వి రావు వీరేపల్లి మాట్లాడుతూ, ఆధునిక ఇంటర్వెన్షనల్ పుల్మనాలజీ సాంకేతికతలతో క్లిష్టమైన శ్వాసకోశ వ్యాధులను సమర్థంగా నిర్వహించగల తమ ఆసు పత్రి నైపుణ్యాన్ని ఈ విజయవంతమైన చికి త్స మరోసారి రుజువు చేసిందన్నారు.