13 May, 2026 | 10:01 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

01-12-2025 01:59 AM

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 30,(విజయక్రాంతి):కొత్తగూడెం గవర్నమెంట్ జన రల్ హాస్పిటల్ లో తొలిసారిగా ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీలు నిర్వహించారు. భద్రాచలం కు చెందిన 26 సంవత్సరాల ఎన్. ఠా గూర్, కొత్తగూడెం కి చెందిన వివాహిత మ హిళ 35 సంవత్సరాల టి.స్రవంతి వేరు వేరు సందర్భాలలో తమ కుడి మోకాలికి దెబ్బ తగిలి వైద్యం కొరకు కొత్తగూడెం జనరల్ హాస్పిటల్ లో ఆర్థోపెడిక్ డాక్టర్లను సంప్రదించినారు. వారికి తగిన వైద్య పరీక్షలు నిర్వ హించి ఇద్దరు పేషెంట్లకు ఏ సి ఎల్ లిగమెం ట్ పూర్తిగా దెబ్బతిందని నిర్ధారించారు.

వారి కి నవంబర్ ఒకటో తారీకు ఆర్థోపెడిక్ వైద్య బృందం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ నరసింహారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్, అనస్సటిస్ట్ డాక్టర్ రమేష్,స్టాఫ్ నర్స్ రాజేష్ వైద్య బృందం అధునాతన ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీ (ఆల్ ఇన్సైడ్ టెక్నిక్) ద్వారా ఏసీఎల్ లిగమెంటు శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించినారు.ఇద్దరు పేషెం ట్లు పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా నడవడం ప్రారంభించారు.ఇలాంటి అధునాతన శస్త్ర చికిత్సలు కొత్తగూడెం జనరల్ హాస్పిటల్ లో నిర్వహించడానికి తమ పూర్తి సహకారం అందించిన కలెక్టర్ జితేష్ పాటిల్ కి, సూపరిండెంట్ ఎం రాధా మోహన్, ప్రిన్సిపల్ ఎం శ్రీహరిరావు కు వైద్య బృందం తమ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.