13 May, 2026 | 11:16 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

నిజాయితీని చాటుకున్న పాత్రికేయుడు గాంధీ

01-12-2025 02:00 AM

బస్సులో నగదుతో దొరికిన పర్సును కండక్టర్‌కి అప్పగింత

బూర్గంపాడు,నవంబర్30,(విజయక్రాంతి):బూర్గంపాడు మండలం ఓ దినపత్రికలో పాత్రికేయుడుగా పనిచేస్తున్న తేజావత్ గాంధీ తన నిజాయితీని చాటుకున్నాడు.ఆదివారం ఉదయం పని నిమిత్తం కొత్తగూడెం నుండి మణుగూరు వెళ్ళే బస్సులో ప్రయాణిస్తున్నాడు.ఈ క్రమంలో ఓ సీటుపై పర్సు పడి ఉండటం చూశాడు. దానిని పరిశీలించగా పర్సులో కొంత నగదుతో పాటు ఏ టీఎం కారడ్స్,పలు ముఖ్యమైన కార్డులు సైతం ఉండడం గమనించారు.

ఆ పర్సు వరంగల్ జిల్లాకు చెందిన ఓ పాత్రికేయుడిదిగా గుర్తించి వెంటనే గాంధీ స్పందించి ఆ పర్సు ను బస్సు కండక్టర్ మాలుంబీ కి అందజేశారు.అనంతరం పర్సులో ఉన్న ఫోన్ నెం బర్ ఆధారంగా బాధితుడికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సదరు వరంగల్ పాత్రికేయుడు కొత్తగూడెం చేరుకోగా,ఆర్టీసీ డిపో మేనేజర్ సమక్షంలో ప ర్సును ఆయనకు సురక్షితంగా అప్పగించా రు.తోటి విలేకరి పట్ల బాధ్యతగా వ్యవహరించి,నిజాయితీ చాటుకున్న తేజావత్ గాం ధీని బస్సులోని ప్రయాణికులు,స్థానికులు, తోటి పాత్రికేయులు అభినందించారు.