11-12-2025 12:00:00 AM
మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో నాన్-సర్జికల్ రేడియోసర్జరీ
హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): హైటెక్ సిటీలోని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్‌లో 31 ఏళ్ల సోమాలియాకు చెందిన పురుష రోగిలో ఉన్న పెద్ద, క్లిష్టమైన మెదడు ఆర్టిరియోవీనస్ మాల్ఫార్మేషన్ (ఏవీఎం)ను ఆధునిక స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ (ఎస్‌ఆర్‌ఎస్) సాంకేతికతతో విజయవంతంగా చికిత్స చేశారు. న్యూరోసర్జన్స్, రేడియేషన్ ఆంకాలజీ నిపుణులతో కూడిన బృందం ఈ కేసును సమగ్రంగా నిర్వహించింది.
ఎంఆర్‌ఐ పరీక్షలో రోగి మెదడులో ఎడమ టెంపరోపారియేటల్ ప్రాంతంలో 5.5 సెం.మీ పరిమాణంలో ఏవీఎం ఉన్నట్లు తేలింది. ఈ ప్రాంతంలో శస్త్రచికిత్స చేయడం మాట, జ్ఞాపకశక్తి, కదలికలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. రోగి కూడా ఓపెన్ సర్జరీకి ఆసక్తి చూపకపోవడంతో, అత్యంత సురక్షితమైన, ఖచ్చితమైన చికిత్సా విధానమైన ఎస్‌ఆర్‌ఎస్‌ను టీమ్ ఎంపిక చేసింది.
అక్టోబర్‌లో 5 సెషన్లలో 30 జీవై రేడియేషన్ చికిత్స అందించారు. చికిత్స అనంతరం రోగి తలనొప్పులు, సీజ్ల్రు గణనీయంగా తగ్గాయని, తాను మళ్లీ సాధారణ జీవన శైలిని కొనసాగిస్తున్నట్లు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. కవిత వాసిరెడ్డి తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్ వంటి ఆధునిక సాంకేతికతలతో ఇప్పుడు క్లిష్టమైన మెదడు సంబంధిత వ్యాధులను సురక్షితంగా, సమర్థవంతంగా, శస్త్రచికిత్స లేకుండానే చికిత్స చేయగలుగుతున్నామని తెలిపారు.