22 June, 2026 | 2:03 AM

సైబర్ నేరాల అవగాహనకు బ్రాండ్ అంబాసిడర్ రష్మిక మందన్న

17-10-2024 12:58 AM

అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): సైబర్ నేరాల అవగా హన కార్యక్రమానికి జాతీయస్థాయి అంబాసిడర్‌గా మంగళవారం హీరోయిన్ రష్మిక మందన్నను కేంద్రం నియమించింది. ఈ డిజిటల్ యు గంలో సైబర్ క్రైమ్ అత్యధిక స్థాయి లో ఉందని, తన డీప్ ఫేక్ వీడియో ని క్రియేట్ చేసి బాగా వైరల్ చేశారని రష్మిక తెలిపారు.

ఇలాంటి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని, వీటిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నానని, అందుకే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ఆమె తెలిపింది. కాగా కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్‌కు జాతీయ బ్రాం డ్ అంబాసిడర్‌గా ఎంపికైన రష్మికకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

దేశంలో సైబర్ భ ద్రతకు జాతీయ అంబాసిడర్‌గా ప్రజలు, యువతలో అవగాహ న కల్పించడంలో రష్మిక నియామ కం ఉపయోగపడుతుందని ఆశిస్తున్న ట్లు ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు.