25 March, 2026 | 2:46 PM

Breaking News

పుకార్లు నమొద్దు... గ్యాస్ బుకింగ్ రూల్స్ మార్చలే.. కేంద్రం క్లారిఫికేషన్   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు: భారత్ పెట్రోలియం ప్రకటన   •   కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •  

అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి

25-07-2024 01:42 AM

బీజీపీ నాయకుల డిమాండ్, నిరసన

యాచారం, జూలై 24 (విజయక్రాంతి): అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాలని కోరుతూ బీజేపీ యాచారం మండలాధ్యక్షుడు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మరెడ్డి, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మర్రిపల్లి అంజయ్య మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో రేషన్ కార్డుల పంపణీపై స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్టే ప్రామాణికమని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు.. వాటిని ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయ కులు నాగిని యాదయ్య, గొల్లపల్లి జంగయ్యగౌడ్, కుమ్మరి గూడెం పురుషోత్తం, గొగికర్ రమేష్, రాయకంటి విజన్‌కుమార్, బూర యాదయ్య, గొల్లపల్లి శ్రీధర్‌గౌడ్, పగడాల శ్రీశైలం, నడికుడి కృష్ణ, పత్తిరాజు పాల్గొన్నారు.