25 March, 2026 | 1:16 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

మహాధర్నాను జయప్రదం చేయండి

25-07-2024 01:28 AM

సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యాదిరెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 24: ఈ నెల 26 ఇందిరా పార్క్ వద్ద భవన నిర్మాణ కార్మికులు నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యాదిరెడ్డి, ఏఐటీయూసీ కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ముత్యాల యాదిరెడ్డి మాట్లాడారు. తాంబూ సిస్టం రద్దు చేయాలని, కార్మికులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ప్రమా దవశాత్తు మరచించిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కార్మికుల కూతురు పెళ్లికి రూ.1 లక్ష ఇవ్వాలని కోరారు.

భవన నిర్మాణ కార్మికులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాలో కార్మికు లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ బీవోసీ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి ప్రసాద్, ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కేతరాజు నర్సింహ, డవుల రాములు, శ్రీనివాస్, సాగర్, మహేందర్, దండ్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు.