కేయూలో ఎలుకలు కొరికేస్తున్నాయి!
14 మంది విద్యార్థులకు గాయాలు
కాకతీయ యూనివర్సిటీ, మార్చి 31 (విజయక్రాంతి): వరంగల్ కాకతీయ యూని వర్సిటీ హా స్టల్లో ఎలుకల బెడద తీవ్రంగా మారింది. సమ్మక్క-సారలమ్మ హా స్టల్‌లో నిద్రిస్తున్న 14 మంది విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కొద్దిరోజులుగా ఒకళ్లిద్దరు ఆస్పత్రి పాలవుతున్నారు. హాస్టల్ పరిసరాల్లో చెత్త పేరుకుపోయి, అపరిశుభ్రంగా మారడం వల్లే ఎలుకలు నివాసయో గంగా మారుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.
ఎలుకలతో పాటు పాములు, కుక్కలతో తమకు ప్రాణ భయం ఉంద ని ఆందోళన చెందుతున్నారు. హాస్టల్ ప్రాంతంలో శుభ్రం చేయాలని, కిటికీలు బిగించాలని అధికారులకు ఫిర్యా దు చేసినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఇ ప్పటికైనా అధికారులు స్పందించాలని ఎస్‌ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు స్టాలిన్, విద్యార్థి సం ఘ నాయకులు కోరుతున్నారు.




