అందరి జీవితాల్లోని మూమెంట్ ఓరి నాయనో
తెలుగు సిల్వర్ స్క్రీన్‌పైకి మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి అభిషేక్ నిర్మాణంలో, డైరెక్టర్ గొండి మణితేజ తెరకెక్కిస్తు న్న చిత్రం ఓరి నాయనో. ’ఎవ్రీ లైఫ్ విల్ హ్యావ్ ఓరి నాయనో మూమెంట్’ అనేది దీ నికి ట్యాగ్ లైన్. ఆదివారం ఈ సినిమా టైటి ల్‌ను హీరో నవీన్ చంద్ర ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ’మా ఊరి పొలిమెర’ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్, నటులు సత్యం రాజేష్, రాజా రవింద్ర, డీవోపీ వెట్రి పళనిస్వామి, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు గొండి మణితేజ మాట్లాడుతూ, ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం తో పాటు గుర్తుండిపోయే పాత్రలు, క్షణాల ను అందించే చిత్రాన్ని రూపొందించేందుకు మా కృషి కొనసాగుతుంది అని తెలిపారు. నిర్మాత సాయి అభిషేక్ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ఉన్నత నిర్మాణ విలువలతో, ప్రతిభావంతమైన సాంకేతిక బృందంతో రూపొందిస్తున్నామని తెలిపారు.
విభిన్నమైన కథలను ప్రోత్సహించడం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ సినిమాల ను అందించడం వీరాంజనేయ ప్రొడక్షన్స్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఓరి నాయ నో చిత్రం వినోదం, భావోద్వేగాలు, ఆధునిక కథనాన్ని సమ్మిళితం చేసిన కొత్త తరహా కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని, వినోదంతో పాటు అనూహ్య మలుపులు, నేటి సమాజాన్ని ప్రతిబింబించే పాత్రలతో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరి స్తుందని చిత్రయూనిట్ తెలిపింది. నటీనటుల ఎంపిక కొనసాగుతుండగా, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.






