13 July, 2026 | 2:30 AM

పొలిటికల్ వార్ షురూ..

13-07-2026 01:31 AM
  1. ఖమ్మం నుంచి కాలుదువ్వుతున్న ప్రధాన పార్టీలు
  2. ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్న అగ్రనేతలు
  3. నెల రోజుల వ్యవధిలో సీఎం, కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పర్యటన
  4. 36 నెలల ముందు నుంచే ప్రచారం షూరు..
  5. ఖమ్మం రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నాలు
  6. ఆసక్తిగా మారిన రాజకీయం.. 

ఖమ్మం, జులై 12(విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 36 నెలలు కడువు ఉంది..  ప్రభుత్వానికి ఆఫ్ టైం మిగిలే ఉందీ.  ఇంకా ఏడాది వరకు ఎన్నికల సమయానికి బ్రేక్ ఉంది. ఇంకా సమయం ఉందిలే అని అనుకుంటారు.. కానీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయింది. 36 నెలల ముందు నుంచే ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. ఎన్నికలకు క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ అన్నట్లుగా 36 నెలలు ముందు నుంచే రాజకీయ రాజకీయ రణరంగానికి కాలు దువ్వుతున్నారు. 

అధికార పార్టీ నాయకత్వం నుంచి ప్రతిపక్ష వామపక్ష పార్టీల వరకు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆయా రాజకీయ పార్టీల అగ్రనేతలు ఆయా జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. పార్టీ శ్రేణులను, నాయకత్వాన్ని అన్ని రకాలుగా సమయత్వం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ క్షణమైన జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ఆలోచనతో అధికార, ప్రతిపక్ష పార్టీలు సాధారణ ప్రచారానికి తెరలేపినట్లు కనిపిస్తోంది.

అధికార పార్టీకి చెందిన ప్రధాన నాయకత్వం జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రివర్గం మొత్తం అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతినెలా  రెండు మూడు జిల్లాలను టార్గెట్ చేసుకొని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని,  బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు సందేశాన్ని అందిస్తున్నారు. నాయకులను, కార్యకర్తలను తట్టి లేపుతున్నారు.

రాబోయేది కూడా మన ప్రభుత్వం అంటూ నాయకులకు,  యువతకు ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పై  కేటీఆర్, హరీష్ రావులపై ధ్వజమెత్తుతున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా ఆ ఇద్దరిపై అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు.సందు దొరికితే చాలు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రతిపక్ష పార్టీలో నాయకులు సైతం ఆ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పై మంత్రులపై విరుచుకుపడుతున్నారు.

సమయానుకూలంగా వ్యవహరి స్తున్నారు. మంత్రుల అవినీతి అంటూ ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటూ పదేపదే ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సందు చూసుకొని దూరిపో వాలని ఆలోచన చేస్తున్న బిజెపి పార్టీ చాపకింద నీరుల వ్యవహరిస్తుంది. కేంద్ర మం త్రులతో పాటు జాతీయ స్థాయి అగ్రనాయకత్వం తెలంగాణపై దృష్టి సారించింది. పార్టీ బలంగా ఉన్న వద్ద బహిరంగ సభలు పార్టీ బలహీనంగా ఉన్న దగ్గర నాయకులు, కార్యకర్తలు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నా రు.

పార్టీ భవిష్యత్త్ పై  నాయకత్వానికి తెలియజేస్తున్నారు.  గ్రౌండ్ లెవెల్ లో పార్టీ శ్రేణులకు నైతిక స్థైర్యాన్ని నింపుతున్నారు. ఇక ఈ మధ్యనే కొత్త పార్టీతో రణరంగంలోకి వచ్చిన కల్వకుంట్ల కవిత, బీసీ నినా దంతో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న సమస్యలు లేవనేత్తి,  సమస్యలపై పోరాటా లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి సంఘీభావం చెబుతూ మీ వెనక మేమున్న అం టూ భరోసా ఇస్తున్నారు.  ప్రభుత్వం పై, ప్ర ధాన ప్రతిపక్షంపై  విమర్శలు చేస్తూ ప్రజల ను  అకట్టుకున్న ప్రయత్నం చేస్తున్నారు. త మ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయ త్నం చేస్తున్నారు. 

ఖమ్మం జిల్లా నుంచే షూరు..

రాజకీయ చైతన్యం కలిగి, పోరాటాలకు పురిటి గడ్డగా ఉంటూ, ప్రభుత్వాల భవిష్యత్తును మార్చేసే ఖమ్మం జిల్లా ఇప్పుడు రాజకీయ రణరంగానికి వేదికైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు ఉమ్మడి ఖ మ్మం జిల్లాను కేంద్రంగా చేసుకొని సమయ త్తం అవుతున్నాయి. ఆయా రాజకీయ పార్టీ లు ఖమ్మం జిల్లాలో కేంద్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రాజకీయ సమర శంఖాన్ని పూరిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లానే టార్గెట్ గా ప్రచార ప్రచారాన్ని షూరు చేశాయి. 

కాంగ్రెస్ కు  కంచుకోటగా ఉం టూ గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలకు తొమ్మిది స్థానాలను గెలిచిన ఖ మ్మం జిల్లాలో మరోసారి తన బలం నిరూపించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చే స్తుంటే,  కాంగ్రెస్ కంచుకోటకు బీటలు వస్తే తప్ప మన పార్టీలకు మనుగడ లేదని భావిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఖమ్మం జిల్లాలోని రాజకీయ ప్రచార కేంద్రంగా మలుచుకుంటున్నాయి.

అందుకే ఆ పార్టీల అగ్ర నాయ కత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించాయి.  అందులో భాగంగానే 36 నెలల ముందు నుంచే అన్ని రాజకీయ పార్టీలు, పా ర్టీల అగ్ర నాయకుల సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ ప్రజలను చైతన్యం చేసే పనులు నిమిత్తమయ్యారు. అధికార పార్టీ ప్రభుత్వం పథకాలతో ప్రజల్లోకి వెళ్తుంటే,  ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

అగ్రనేతులందరూ ఖమ్మంలో తిష్ట

గత నెల రోజుల నుంచి అన్ని పార్టీల ప్రధాన నాయకత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లా పై దృష్టి సారించారు. అనేక ముఖ్య నాయకులు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక్కడే తిష్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  ఖమ్మం జిల్లాలో గ్రామ గ్రామాన పర్యటిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు.  ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద బహిరంగ సభతో ప్రభుత్వం పని చేసే విధానాన్ని ప్రజలకు, రైతులకు వివరించారు. ఆయన ప్రతి పక్షం నేతలను టార్గెట్ చేస్తూ చేసే ప్రసంగాలు సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ప్రభుత్వ పథకాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వివరాలు ఇన్చార్జి మీనాక్షి నటరాజన్  కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. కార్యకర్తలను, నాయకులను సమయత్వం చేశారు.

ఎస్‌ఐఆర్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలని సూచించారు.  అలాగే ఒకపక్క కేటీఆర్, మరోపక్క హరీష్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ కార్యకర్తలకు నాయకులకు రాజకీయ శిక్షణ ఇస్తున్నారు.  10 రోజులకు ఒకరు చొప్పున ఇద్దరు బావమరుదులు జిల్లాలో పర్యటిస్తుండటం గమనర్హం. ప్రభుత్వ పథకాల  వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అలాగే బిజెపి పార్టీ జాతీయ నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్,  బిజెపి అధ్యక్షుడు నితిన్,  మాజీ అధ్యక్షుడు నడ్డా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీలు రఘునందన్ రావు, అరవింద్, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాను కేంద్రంగా చేసుకొని నాయకులు కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కొన్ని స్థానాలపై  కన్నేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని స్థానాలను గెలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

తద్వారా ప్రభుత్వాన్ని ఖమ్మం  దక్కించుకోవచ్చని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాను టార్గెట్ గా చేసుకూని ఆయా పార్టీల అగ్రనాయకత్వం మొత్తం ఖమ్మంలో తిరుగుతున్నారు. అలాగే అధికార పార్టీ తనకున్న బలంతో పాటు మిగిలిన ఒక స్థానాన్ని కైవసం చేసుకుని క్లీన్ షిప్ చేయాలని చూస్తుంది..ఈ క్రమంలో 36 నెలల ముందు నుంచి రాజకీయ సమరానికి అన్ని పార్టీలు సిద్ధమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేంద్రంగా ఎంచుకున్నాయి. చూద్దాం భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో.. చూడాలి.