calender_icon.png 17 February, 2026 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్‌గా రవి

17-02-2026 12:00:00 AM

అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా కంఠం శిరీష

శామీర్‌పేట్, ఫిబ్రవరి 16 (విజయ క్రాంతి): అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్స న్‌గా కంఠం శిరీష (కాంగ్రెస్), మూడు చింతలపల్లి మున్సిపల్ చైర్మన్‌గా జాం రవి (బిఆ ర్‌ఎస్) ఎన్నికయ్యారు. మూ డు చింతలపల్లి మున్సిపొలిటిలో మొత్తం 24 స్థానాలు ఉండగా చైర్మన్ పదవీకి అవసరమైన మ్యాజి క్ ఫిగర్ 13 కాగా బిఆర్ ఎస్ పార్టీ 14 వార్డులలో గెలుపొందడంతో ఏ పార్టీ మద్ద తు లేకుండా మున్సిపల్ చైర్మన్ పీఠాన్నిదక్కించుకుంది. 

వైస్ చైర్‌పర్సన్‌గా మోర్సు బాయి శశిరేఖ (బిఆర్‌ఎస్) ఎన్నికయారు. మున్సిపల్ చైర్మన్ పదవికి జాం రవి పేరును విష్ణువర్ధన్ రెడ్డి ప్రతిపదించగా, ర్యకాల నీరాజ్ గౌడ్ మద్దతు తెలిపారు.వైస్ చైర్ పర్సన్ పదవి కోసం శశిరేఖ పేరును నవీన్ ప్రతిపాదించగా, మాడబోయిన మౌనిక మద్దతు తెలిపారు. 

 అలియాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 స్థానాలు ఉండగా చైర్మన్ పదవికి అవసరమయ్యే స్థానాలు 11 కాగా కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు, బిఆర్‌ఎస్ పార్టీ 7 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు బిఎస్ పి 1 స్థానం, స్వతంత్ర అభ్యర్థి 1 స్తానం రాగ చైర్మన్ పీఠం దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్  11 కావాలి.  కాంగ్రెస్ పార్టీ బిజెపి, బిఎస్ పి, స్వతంత్ర అభ్యర్థి ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ తరుపున 8 సిట్లతో కంఠం శిరీష మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా బిజెపి అభ్యర్థి మాలతీ ఎన్నికయారు. మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కోసం కంఠం శిరీష పేరును వనజ అశోక్ రెడ్డి ప్రతిపాదించగా, ముద్దం సుధాకర్ రెడ్డి మద్దతు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పదవీకోసం మాలతి పేరును గణేష్ ప్రతిపాదించగా, స్వప్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన మూడు చింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జామ్ రవి మాట్లాడుతూ... నా గెలుపు కారణమైన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపొలిటి ప్రజలు నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాన్నారు.