17-02-2026 12:00:00 AM
మిర్యాలగూడ, ఫిబ్రవరి 16 : ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని బిఆర్‌ఎస్ యువ నేత నల్లమోతు సిద్ధార్థ అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలో 48 వార్డులలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను పరామర్శించి ధైర్యం కల్పించి మాట్లాడారు. గెలుపో టములు సహజమని, పదవులతో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేసే తత్వం మన పార్టీ డీఎన్‌ఏలోనే ఉందని ఓడిన అభ్యర్థులకు ధైర్యం చెప్పారు.
మనం గతంలో చేసిన అభివృద్ధి మరియు సంక్షేమం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఆ నైతిక విజయమే రేపు మళ్ళీ మనల్ని గెలుపు తీరాలకు చేరుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటమిని చూసి అధైర్యపడకుండా రెట్టింపు ఉత్సాహంతో క్షేత్రస్థాయి లోకి వెళ్లాలని పిలుపునిస్తూనే, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను, అభ్యర్థిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసాను కల్పించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు