23 May, 2026 | 8:48 PM

కవిత్వంలో మంథనికి వన్నెతెచ్చిన రావికంటి రామయ్య

18-06-2024 12:27 AM

మంథని, జూన్ 17 (విజయక్రాంతి): రావికంటి రామయ్య కవిత్వంలో మంథనికి వన్నె తెచ్చారని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రమా సురేశ్‌రెడ్డి కొనియాడారు. ఆదివారం రావికంటి రామయ్య 88వ జయంతి సందర్భంగా మంథని పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. రామయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రామయ్య స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

పాఠ్యపుస్తకంలో చోటు దక్కించుకుని ప్రాంతానికి గుర్తింపు తెచ్చారని పేర్కొన్నారు. మంథని అంటే ఆయనకు ఎంతో ప్రేమ అని, సరళమైన పదాలతో ప్రజలకు సులువుగా అర్థమయ్యే లా కవిత్వం చెప్పడం ఆయనకే చెల్లిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వేముల సమ్మయ్య, గుండ పాపారావు, సీనియార్ జర్నలిస్టు రావికంటి శ్రీనివాస్, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.