26 May, 2026 | 6:19 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

అవకాశం ఇస్తే.. అంతరిక్ష యాత్రకు సిద్ధం :రవీష్ మల్హోత్రా

19-08-2024 03:17 PM

 ఢిల్లీ: తనకు ఇప్పుడు అవకాశం వచ్చినా సరే! అంతరిక్షయాత్ర కు సిద్ధమని రిటైర్డ్ ఎయిర్ కమొడోర్ రవీష్ మల్హోత్రా తెలిపారు. త్వరలో నేషనల్ స్పేస్ డే రానున్న సందర్భంగా మీడియ సమావేశంలో తన అంతరంగాన్ని వెల్లడించారు. వింగ్ కమాండర్ రాకేశ్ శర్మతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లేందుకు శిక్షణ  పొందిన విషయం తెలిసిందే. 1984 లో అంతరిక్ష యాత్రకు వెళ్లే అవకాశాన్ని కోల్పోవడం జీర్ణించుకోలేని బాధాకర విషయమన్నారు. కానీ రాకేశ్, రవీష్ లలో ఇద్దరికే అవకాశం ఉందన్న కఠోర వాస్తవం తనకు తెలిసినందున తాను ఓదార్పు పొందానన్నారు. ఇప్పుడు అవకాశం వచ్చినా గగన్ యాన్ మిషన్లో భాగంగా వెళ్లడానికి సిద్ధమేనన్నారు. అమెరికా సెనెటర్ 77 ఏళ్ల వయస్సులో వెళ్లారు. అలాంటప్పుడు నేను సైతం అంతరిక్షానికి వెళతానని ఆశాభావం వ్యక్తం చేశారు.