30 July, 2026 | 1:32 AM

వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

30-07-2026 12:30 AM

దులీప్ ట్రోఫీకి ఈస్ట్‌జోన్ జట్టు ప్రకటన

ముంబై, జూలై 29 : భారత క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ప్ర మోషన్ దక్కింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వైభవ్‌కు దేశవాళీ క్రికె ట్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టె న్‌గా వైభవ్ ఎంపికయ్యాడు.

ఈ టోర్నీ కో సం 15 మందితో కూడిన ఈస్ట్ జోన్ జట్టు ను ప్రకటించారు. ఇషాన్ కిషన్ కెప్టెన్‌గానూ, వైభవ్ అతనికి డిప్యూటీగానూ వ్యవహరించనున్నాడు. ఈస్ట్ జోన్ జట్టులో భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, ముకేశ్ కు మార్, షాబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్, అంకుల్ రాయ్, విరాట్ సింగ్ వంటి ప్లే యర్స్ చోటు దక్కించుకున్నారు. దులీప్ ట్రోఫీ ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వర కూ జరుగుతుంది. తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్‌తో తలపడుతుంది.