12-11-2025 05:21:11 PM
నిర్మల్ (విజయక్రాంతి): స్థానిక నిర్మల్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల(బాలుర) నందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆర్సిఓ శ్రీధర్ బుధవారం తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించబడెను. ఈ సందర్బంగా ఆర్సిఓ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ జ్ఞానం అనేది విద్యార్థుల తెలివికి పదును పెట్టి, వారిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుందని.. ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ & DCO శ్రీ కోడె జీవన్ కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ బట్టు విజయ్ కుమార్, ఖానాపూర్ ప్రిన్సిపాల్ సంతోష్ తో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.