7 March, 2026 | 2:14 AM

పువ్వు తీసుకో.. అప్పు కట్టు

06-03-2026 06:14 PM

2,13,400 మహిళా సంఘాల పాత రికవరీ వసూలు 

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలో మూడవరోజు ఐకెపి ద్వారా క్లస్టర్లు వారిగా వివిధ గ్రామాల్లో రికవరీ చేసిన మొత్తం రెండు లక్షల 13,400 పాత బకాయిలు వసూలు చేసినట్లు నాగిరెడ్డిపేట్ మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు.తక్కువగా ఉన్న ఎన్.పి.ఏ అమౌంట్ అందరూ కట్టుకోవాలని కట్టిన వెంటనే మీకు కొత్త రుణం మంజూరు అవుతుందని మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. కావున మండలంలోని ఆయా గ్రామాల్లోని సంఘ సభ్యులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మూడవరోజు గ్రామాల వారీగా రికవరీ ద్వారా బొల్లారం గ్రామ సంఘం 14,400/-వాడి 5000/-కన్నారెడ్డి 1,60,000/- అచ్ఛయపల్లి 9000/-బంజారా తండా 15000/-అక్కంపల్లి 10,000/-మొండి బకాయిలు రెండు లక్షల 13,400 రూపాయలు వసూలు అయినట్లు మండలం ఇంచార్జ్ ఏపీఎం రామనారాయణ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్,సీసీలు నారాయణ,దత్తు, శ్రీనివాస్ రెడ్డి,కార్యదర్శులు వెంకట్ రాములు,సంతోష్ కుమార్,నరేష్,మమత,రమేష్,కిష్టయ్య మరియు వివోఏలు తదితరులు పాల్గొన్నారు.