12-11-2025 05:17:08 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): పశువైద్యశాల తుంగతుర్తి నందు జిల్లా పశువైద్య పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ డి శ్రీనివాస్ రావు తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించినారు, ఈ సమావేశంలో పశువులలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం గురించి మండల వారిగా సమీక్షించారు. ఇప్పటివరకూ నియోజకవర్గం వారిగా సూర్యాపేట జిల్లా కింద 34300 కు గాను 24250 పశువులకు టీకాలు వేయడం జరిగింది. మొత్తం 14 బృందాలు ఈ టీకాలను వేయడం జరుగుతుందని, మిగతా పశువులకు ఈ నెల 14 వరకు పూర్తి చేయాలని సూచించడం జరిగింది. అలాగే ప్రతీ పశువైద్యశాల తమకు కేటాయించిన లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని, రైతులకు అందుబాటులో ఉండాలని సూచించడం జరిగింది. ఈ సమావేశంలో సహాయ సంచాలకుడు డాక్టర్ వెంకన్న డాక్టర్ రవిప్రసాద్ నియోజకవర్గం డాక్టర్లు డా నరేష్, డా రవి, డా రవికుమార్, డా అర్జున్, డా నవీన్, సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు.