‘సర్’ ప్రక్రియను తనిఖీ చేసిన ఆర్డీఓ
వీపనగండ్ల జులై 12: మండల పరిధిలోని వల్లభాపురం గ్రామంలో నిర్వహించనున్న సర్ కార్యక్రమాన్ని కొల్లాపూర్ ఆర్డిఓ బన్సీలాల్ ఈ ఆర్వో ఆదివారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న దరఖాస్తుల స్వీకరణ ఓటర్ జాబితా సవరణలు రికార్డ్ నిర్వాహరణ ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్డీవో బన్సీలాల్ మాట్లాడుతూ సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నియబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు అర్హులైన ప్రతి ఓటర్ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తులను త్వరగా తిన పరిశీలించి నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఖాజమైనుద్దీన్ బి ఎల్ ఓ లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






