30 June, 2026 | 10:14 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

చేవెళ్లకు బదిలీ అయిన ఆర్డీఓకు ఘన సత్కారం

27-02-2026 04:19 PM

విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేసిన అధికారిగా ప్రశంసలు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఆర్డీఓగా పనిచేస్తున్న పార్టసింహారెడ్డి చేవెళ్లకు బదిలీపై వెళ్తుండగా శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి శాలువాతో ఆర్డీఓను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టసింహారెడ్డి విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేస్తూ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారని తెలిపారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా సేవలు అందించారని కొనియాడారు. ఇక్కడి నుండి బదిలీపై వెళ్లడం స్థానిక ప్రజలకు బాధకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని,అయినప్పటికీ ఆయన చేసిన సేవలు ప్రజల మదిలో నిలిచిపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఆర్డీఓకు శుభాకాంక్షలు తెలియజేశారు.