30 June, 2026 | 9:12 PM

Breaking News

డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •  

రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి

27-02-2026 04:22 PM

మంథనిలో అరైవ్-అలైవ్ కార్యక్రమంలో మంథని సీఐ రాజు

మంథని,(విజయక్రాంతి): రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని మంథనిలో  అరైవ్-అలైవ్ కార్యక్రమంలో మంథని సీఐ రాజు సూచించారు. శుక్రవారం మంథని పట్టణంలో  సీఐ ఆధ్వర్యంలో అరైవ్-అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమం 2026లో భాగంగా, మంథని సర్కిల్ పరిధిలోని మంథని, రామగిరి, ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రైవర్లకు కంటి పరీక్ష శిబిరం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 120 మంది డ్రైవర్లు హాజరయ్యారు. అవసరమైన   డ్రైవర్లకు సీఐ రాజు కళ్లద్దాలు  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  రామగిరి ఎస్ఐ శ్రీనివాస్, ముత్తారం ఎస్ఐ రవి కుమార్  మంథని ఎస్ఐ -2 సాగర్ లతో కలిసి విజయవంతంగా నిర్వహించారు.