calender_icon.png 17 September, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మసాగర్- ముడిమ్యాల రోడ్డుకు రీబీటీ

17-09-2025 12:49:18 AM

ఎమ్మెల్యే కాలె యాదయ్య 

చేవెళ్ల, సెప్టెంబర్ 16: ధర్మసాగర్ స్టేజీ నుంచి ముడిమ్యాల వరకు ఉన్న రోడ్డుకు రీబీటీ చేయిస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రకటించారు. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపామని వెల్లడించారు. మంగళవారం చేవెళ్ల మండలం లక్ష్మీగూడ గ్రామంలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, గుండాలలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, సాయిరెడ్డిగూడలో రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, అల్లవాడలో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్,

చన్వెల్లిలో రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, రూ.10 లక్షలతో అండర్ గ్రౌండ్ డైనేజీ, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, గొల్లపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, ధర్మసాగర్లో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, కుమ్మెరలో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, రావులపల్లిలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, ముడిమ్యాల్లో రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్‌కు శంకుస్థాపన చేశారు.

అనంతరం మూడిమ్యాల స్కూల్ గ్రౌండ్‌లో పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన  మాట్లాడుతూ..  విడతలవారీగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.  ప్రతాప్ రెడ్డి స్వచ్ఛందగా సేవ చేయడం అభినందనీయం అన్నారు.

అనంతరం స్కూల్ విద్యార్థులకు స్పోరట్స్ డ్రెస్, షూస్, టై అందించారు.  రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మాలతికృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, ముడిమ్యాల్, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్లు గోనె ప్రతాప్రెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్లు పడాల ప్రభాకర్, కేసారం శ్రీనివాస్, గోటూరి రాంచంద్రయ్యగౌడ్,  డీసీసీబీ ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, పడాల రాములు,

మహిళా కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గోనె సరితా రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ కేసారం నరేందర్, కాంగ్రెస్ మండల, మున్సిపల్ అధ్యక్షులు ఆలంపల్లి వీరేందర్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, స్థానిక నాయకులు హరికిషన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బూర్ల సాయినాథ్, పడాల జనార్దన్, మహేందర్, వాజిద్, ఊరడి ప్రవీణ్, దామరగిద్ద శ్రీరామ్, బూర్ల నిరంజన్ బూర్జుకాడి గోపాల్, చాకలి శ్రీనివాస్, మల్గని సతీష్, మహేందర్, సూద రాము, గౌడిచర్ల మల్లేష్, పాల్గొన్నారు.