17-09-2025 12:51:41 AM
ఎంపీ ఈటల రాజేందర్, కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి
ఎల్బీనగర్, సెప్టెంబర్ 16 : ఉపాధ్యాయులతోనే సమాజ నిర్మాణం అవుతుందని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేవారని ఎంపీ ఈటల రాజేందర్, కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయు రాలు సూర్యపల్లి ఉమాదేవి ఉద్యోగ విరమణ సభను మంగళవారం సరూర్ నగర్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.
ఈ సభకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సూర్యపల్లి ఉమాదేవి (M.Sc, B.Ed.) ఉద్యోగ విరమణ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్, గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ.. ఉపాధ్యాయు లు సమాజ నిర్మాణ శిల్పుల న్నారు.
ఉపాధ్యాయురాలు ఉమాదేవి తన సేవాకాలమంతా క్రమశిక్షణ తో, నిబద్ధతతో పనిచేసి అనేకమంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దారని తెలిపారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందడం ఆమె ప్రతిభకు, కృషికి నిదర్శనమని, గురువులను గౌరవించడం సమాజ బాధ్యత అన్నారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.