15 April, 2026 | 4:48 AM

గ్రంథాలయాలను పాఠకులు సద్వినియోగం చేసుకోవాలి

21-11-2025 12:00 AM

గద్వాల, నవంబర్ 20 : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా పేరు పొందాయని, పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల చివరి రోజు గురువారం గద్వాలలోని కేంద్ర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరై సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి  పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు కూడా గ్రంధాలయాలకు తర చూ వస్తూ తమకు అవసరమైన పుస్తకాలను చదివి సద్వినియోగం చేసుకోవా లని పిలుపునిచ్చారు.

అనంతరం నవంబర్ 14 నుండి 20 వరకు జరిగినటు వంటి వివిధ పోటీల్లో గెలుపొందిన ఆ యా పాఠశాలల, కళాశాలల విద్యార్థిని, విద్యార్థులకు  చిత్రలేఖనం వ్యాసరచన, క్విజ్, రంగోలి పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి రామాంజనేయులు, గోవర్ధన్, శ్రీధర్, వెంకటేష్, పాఠకులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.