20-11-2025 10:48:46 PM
హైదరాబాద్: పాదరక్షల వారసత్వంపై గచ్చిబౌలిలోని ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో(ఎఫ్డీడీఐ)లో నవంబర్ 28-30 తేదీల్లో జాతీయ సదస్సు, ప్రదర్శనలను నిర్వహిస్తున్నట్లు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, మరియు ఎఫ్డీడీఐ ఒక ప్రకటనలో తెలిపారు. 28వ తేదీ ఉ.11:00 గం.లకు తెలంగాణ గవర్నర్, శ్రీ విష్ణుదేవ్ వర్మ ప్రారంభించే ఈ జాతీయ సదస్సులో భారతదేశ పాదరక్షల ఘన వారసత్వం, కళా సంప్రదాయలు, రూపకల్పన పరిణామంపై నిపుణులతో ప్రసంగాలు, పాదరక్లల చారిత్రక నేపథ్యంపై ప్రత్యేక ప్రదర్శన ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
విద్యార్థులు, పరిశోధకులు, డిజైనర్లు, కళాకారులూ, వారసత్వ ప్రేమికులు అందరూ ఈ సదస్సులో పాల్గోని జయప్రదం చేయాలని వారు కోరారు. ఎఫ్డీడీఐలో గురువారం నాడు జరిగిన సన్నాహక మరియు కాన్ఫరెన్స్ సమావేశంలో, ఎఫ్డీడీఐ, హైదరాబాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డా. నరసింహుగారి తేజ్ లోహిత్ రెడ్డి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, చైర్ పర్సన్ డా. తేజస్విని యార్లగడ్డ, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, డా.ఈమని శివనాగిరెడ్డి, ఎఫ్డీడీఐ అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారని నిర్వాహకులు చెప్పారు.