5 June, 2026 | 2:34 AM

మేడ్చల్ 7వ అంగన్వాడీ కేంద్రంలో సంసిద్ధత మేళా

05-06-2026 12:08 AM

మేడ్చల్ అర్బన్ జూన్ 4(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చ ల్ సర్కిల్ పట్టణంలోని 7వ అంగన్వాడి కేం ద్రంలో ప్రథమ్ ఫౌండేషన్ కు చెందిన వా రు పాఠశాల సంసిద్ధత మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅ తిథిగా డిడబ్ల్యూఓ ఎం శారద హాజరై మా ట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అం గన్వాడి కేంద్రాలను అభివృద్ధి చేశామని ఆ టలు-పాటల ద్వారా విద్యను బోధిస్తున్నామ ని తెలిపారు.

అంతే కాకుండా శారీరక వికా సం, భాష వికాసం,బుద్ధి,పూర్వ గణిత వికా సం గురించి మాట్లాడుతూ 5 రకాల అభివృద్ధిలో పిల్లల అభివృద్ధికి దోహదపడతాయని ఆమె తెలిపారు. అదేవిధంగా గర్భవతులు, బాలింతలు అంగన్వాడి కేంద్రాలలో లభించే పౌష్టికాహారం,బాలామృతం తీసుకోవాలని తల్లులకు ఆమె సూచించారు.ప్రథమ్ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ లలిత,మాస్టర్ ట్రైనర్ తిమ్మప్ప,చైతన్య లు పిల్లలకు 5 అభివృద్ధిలపై ఆటలు నిర్వహించినట్లు శారద వెల్లడిం చారు.

పిల్లలకు ఐదు అభివృద్ధిలపై ఆటలు నిర్వహించగా దాదాపు 60 మంది పిల్లలు ఆటలు-పాటలు,కథలు,సంభాషణలు,పూర్వ గణిత భావనలు ప్రదర్శించి తల్లి దండ్రుల ను సంతోష పరిచినట్లు ఆమె స్పష్టం చేశా రు. ఈ నేపథ్యంలో భాష,మేదస్సు,సామాజి క అభివృద్ధి సృజనాత్మకత గురించి వివరించి పిల్లలకు రిపోర్టు కార్డులను తల్లులకు తెలియజేసినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్  ఎ హైమావతి.అంగన్వాడి టీచర్ లు శోభారాణి, ఉమారాణి, ఇందిరా, ధనలక్ష్మితో పాటు పిల్లల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.