బైపీసీ పూర్తయిన అమ్మాయిలకు డిగ్రీ కాలేజీలోకి ఆహ్వానం
ఘట్ కేసర్, జూన్ 4 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి అంకుశాపూర్లోని మహేంద్ర హిల్స్ శాఖకు చెందిన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 202627 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ అసిరెడ్డి తెలిపారు. కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో బీజడ్సి, ఎంబీజడ్సి, ఎన్డీజడ్సి, బీటిబీసి, బీజీసి, బీసీబీసి, ఎంబీసీసీఎస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన అర్హత గల విద్యార్థినులు ఎస్‌ఎస్సి, ఇంటర్ మెమోలు, టీసీ, కుల, ఆదాయ, నివాస ధృవపత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు, పాస్పోర్ట్ సైజు ఫోటోలతో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్స్ 9121004524, 9553737422, 9550374822 ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మి అసిరెడ్డి తెలిపారు.






