30 April, 2026 | 2:48 AM

కేటీఆర్ నాయకత్వంలో భారీ ఆందోళనకు సిద్ధం

30-04-2026 01:47 AM

టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్

సిరిసిల్ల, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అమ రవీరుల స్థూపం వద్ద టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు.బకాయిలో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులకు రావాల్సిన నిధులు నెలలుగా పెండింగ్లో ఉంచడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.750 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పేద విద్యార్థులు ఫీజుల కోసం పార్ట్టైం పనులు చేస్తూ చదువుకుంటున్న దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనలో స్కాల ర్షిప్లు సమయానికి అందేవని గుర్తు చేశారు. బకాయిలు వెంటనే చెల్లించకపోతే కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరెల్లి విన య్ కుమార్, ముధం అనిల్ గౌడ్, ఎస్.కె అజ్జు, సాదు శేఖర్, సామల హరీష్, బల్యాల ప్రవీణ్ శశి, ఎస్కే పాషా, రాజా తదితరులు పాల్గొన్నారు.