30 April, 2026 | 2:57 AM

ఇబ్రహీంపట్నంలో అంగ్లిస్ట్ హైస్కూల్ అగ్రస్థానం

30-04-2026 01:47 AM

ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో ఘన విజయం

హైదరాబాద్/ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 29(విజయక్రాంతి): అంగ్లిస్ట్ హైస్కూల్ 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసి, ఇబ్రహీంపట్నం మండలంలో అత్యధిక మార్కులు సాధించిన పాఠశాలగా నిలిచింది.ఈ ఏడాది టాపర్లలో దోర్నాల పావని 600 మార్కుల్లో 578 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. థాండ్ర హారిక 566 మార్కులతో ద్వితీయ స్థానం, హాజెరా 556 మార్కులతో తృతీయ స్థానం దక్కించుకున్నారు.

అలాగే నాదిగిరి ఐశ్వర్య 554 మార్కులతో నాలుగో స్థానం, గిడిజాల గ్రీష్మ 551 మార్కులతో ఐదో స్థానం, ఎరిగె సంతోష్ 551 మార్కులతో ఆరో స్థానంలో నిలిచారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ భాను ప్రసాద్ మాట్లాడుతూ, మా విద్యార్థులు సాధించిన ఈ ఫలితాలు ఇబ్రహీంపట్నం మండలంలోనే అత్యుత్తమంగా నిలవడం గర్వకారణం. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.