15 April, 2026 | 12:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రధాన పార్టీలకు రెబల్స్ గుబులు!

07-02-2026 02:00 AM
  1. పార్టీ అభ్యర్థులకు ధీటుగా ప్రచారం
  2. గత ఎన్నికల్లో 35 మంది స్వతంత్రులు గెలుపు
  3. ఈసారి 19 మున్సిపాలిటీలకు 392 మంది పోటీ 
  4. ఉమ్మడి జిల్లాలో ఆసక్తికర చర్చ

సంగారెడ్డి, ఫిబ్రవరి 6(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబ ల్స్ బెడత తలనొప్పిగా మారింది. మొదటి నుంచి పార్టీ పరంగా పలువురు టికెట్టు ఆ శించినప్పటికీ అధిష్టానాలు సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడంతో మి గతా వారికి మొండి చేయి తప్పలేదు.

టికెట్టు దక్కని వారికి పార్టీ పరంగా సహకారం, నా మినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ అసంతృప్తులు పలు వార్డుల్లో దిగిరాలేదు. పలు వార్డుల్లో ప్రధాన పార్టీ అ భ్యర్థులకు ధీటుగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఫలితాలపై ఎలాంటి ప్ర భావం చూపుతాయోననే ఆందోళన ఆయా పార్టీల్లో నెలకొంది. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్కే ఎక్కువ...

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందు లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకే ఎక్కువగా రెబల్స్ బెడద ఏర్పడింది. కొందరిని బుజ్జగించినప్పటికీ చాలావరకు బరిలోనే స్వతంత్ర అభ్యర్థులుగా, కొందరు బీఎస్సీ, మరికొందరు జనసేన పార్టీ నుండి బరిలో ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలలో 1,658 మంది అభ్యర్థులు పోటీ పడు తుండగా ఇందులో 392 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

వీరిలో ఎక్కువగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, సంగారెడ్డి మున్సిపాలిటీలలో ఎక్కువగా ఉన్నారు. వీరంతా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నుండి టికెట్టు ఆశించి భంగపడ్డ వారే అధికంగా ఉన్నారు. అయితే రెబల్ అభ్యర్థులపై పార్టీ పరంగా వివరణ కోరుతూ షోకా జ్ నోటీసులు జారీ చేసినప్పటికీ ససేమిరా అంటూ రంగంలోకి దిగారు. వీరిపై ఆయా పార్టీలు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఫలితాల తర్వాతనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 

బరిలో 392 మంది రెబల్స్...

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలలో 392 మంది స్వతంత్రులు రంగంలో ఉన్నారు. వీరంతా ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా లో 11 మున్సిపాలిటీలకు 1,045 మంది అభ్యర్థులు ఉండగా ఇందులో 276 మంది రెబల్స్గా పోటీ చేస్తున్నారు. వీరిలో సంగారెడ్డిలో 52 మంది, జహీరాబాద్లో 58 మంది అత్యధికంగా ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలకు 326 మంది అభ్యర్థులుండగా 73 మంది రెబల్స్ పోటీ చేస్తున్నారు.

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో 287 మంది బరిలో ఉండగా ఇందు లో 43 మంది స్వతంత్రులు పోటీ చేస్తున్నా రు. అయితే అసలు సమస్య ఇక్కడే ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35 మంది స్వతంత్రులు గెలుపొందడంతో ఆయా మున్సిపాలిటీల లో చైర్మన్ పీఠాలను గెలుపొందేందుకు కీలకంగా మారారు.

ఈసారి కూడా ఇదే వైనం పునరావృతం అవుతుందా అనే ఆందోళన నెలకొంది. ప్రచారంలో సైతం ప్రధాన పార్టీలకు ధీటుగా చేస్తుండడంతో ఎంతమంది స్వతంత్రులు గెలుపొందుతారనే చర్చ అన్ని పార్టీల్లో మొదలైంది. మొత్తంగా స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలకు మాత్రం గుబులు పుట్టిస్తున్నారనడంలో సందేహం లేదు.