calender_icon.png 13 September, 2024 | 12:19 AM

యూఎస్ నుంచి డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తుల రీకాల్

05-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: తయారీ సంబంధిత సమస్యల కారణంగా యూఎస్ నుంచి డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్, లుపిన్‌లు వాటి ఉత్పత్తులు రీకాల్ చేస్తున్నట్టు యూఎస్ డ్రగ్ రెగ్యులేటర్ యూఎస్‌ఎఫ్‌డీఏ తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యక లాపాలు నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్ యూఎస్ సబ్సిడరీ డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ ఇంక్ తన ఐబుప్రొఫెన్ టాబ్లెట్లను రికాల్ చేస్తున్నట్టు రెగ్యులేటర్ తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. ఐబుప్రొఫెన్‌ను పెయిన్ రిలీఫ్, ఫీవర్ కోసం ఉపయోగిస్తారు. ముంబైకి చెందిన మరో ఫార్మా కంపెనీ లుపిన్ బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్‌కు వాడే తన సెఫిక్సిమి ఓరల్ డ్రగ్‌ను రీకాల్ చేస్తున్నదని యూఎస్‌ఎఫ్‌డీఏ తెలిపింది.