calender_icon.png 5 November, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకు అభివృద్ధికి సహకరిస్తా: మంత్రి పొన్నం

05-11-2025 11:27:08 AM

రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) నూతన పాలకవర్గానికి హామీ ఇచ్చారు.  బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ పాలకర్గ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ నూతన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలుపుతూ బ్యాంకును అగ్రగామిగా నిలపాలని సూచించారు. అనంతరం తనవెంట జూబ్లీహిల్స్ ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ వద్దకు తీసుకువెళ్లి కొత్త పాలకవర్గ చైర్మన్, సభ్యులను మంత్రి పరిచయం చేశారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ వారిని అభినందించారు.