05-11-2025 11:43:31 AM
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా(Government Advisor) పి. సుదర్శన్ రెడ్డి బుధవారం నాడు బాధ్యతలు(P. Sudarshan Reddy takes charge ) స్వీకరించారు. సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ లో సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం ఛాంబర్ కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రులు, నేతలు సుదర్శన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన నేపథ్యంలో పి. సుదర్శన్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జుబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు మంత్రి పదవి ఆశించారు. కానీ వారికి దక్కలేదు. దీంతో అధిష్ఠానం సీనియర్ నేతలకు కీలక పదవులు కట్టబెట్టింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి శాంతింపజేసింది. ఇద్దరికీ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.