16 May, 2026 | 2:09 AM

ప్రతి వ్యక్తి కృషికి గుర్తింపు

16-05-2026 12:00 AM

వీహెచ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ కుమార్ గౌడ్

అంబర్‌పేట, మే 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పదవి బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి నాయకుడికి తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. వీహెచ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.