పనిచేసే వారికే పార్టీలో గుర్తింపు..
రామాయంపేట, మే 1: కాంగ్రెస్ పార్టీ గీత దాటితే నాయకులపై చర్యలు తప్పవని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. రామాయంపేట పట్టణానికి చెందిన ముస్లిం యువకులు శుక్రవారం పెద్ద ఎత్తున మైనంపల్లి సమక్షంలో హస్తానికి చేరువయ్యారు. ఈ సందర్భంగా మైనంపల్లి వారికి కండువాలు వేసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తో కలిసి మాట్లాడుతూ ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ సీట్లు దక్కని వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల్లో సర్వే రిపోర్ట్ ప్రకారం టికెట్లు కేటాయించి చైర్మన్ గిరి సాధించుకున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు,వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత గణేష్,కౌన్సిలర్లు పుట్టి సందీప్,బైరం స్వప్న, డాకి శ్యామల, దేవుని రంజిత్,కాంగ్రెస్ నాయకులు సరాఫ్ యాదగిరి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చింతల స్వామి, మహేందర్ రెడ్డి,మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి,పుట్టి రాజు,అమర సేనా రెడ్డి లు ఉన్నారు.






