వీహెచ్‌ను కలిసిన గాలి అనిల్ కుమార్
02-05-2026 12:00 AM
పటాన్చెరు, మే 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమం, అభివృద్ధి శాఖ సలహాదారుగా నియమితులైన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావును టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా బీసీ సంక్షేమ రంగంలో విహెచ్ అనుభవం, మార్గదర్శకత్వం కీలకంగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. విహెచ్ నాయకత్వంలో రాష్ట్రానికి మరింత దిశానిర్దేశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






