26 May, 2026 | 8:27 AM

పీర్జాదిగూడ జేపీ హాస్పిటల్ గుర్తింపు రద్దు

14-12-2024 12:00 AM

మేడ్చల్, డిసెంబర్ 13: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని  సాయి నగర్ లో ఉన్న జేపీ హాస్పిటల్ గుర్తింపును వైద్యశాఖ ఉన్నతాధి కారులు శుక్రవారం రద్దుచేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ఉల్లంఘించినందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ చట్టం ప్రకారం అర్హత కలిగిన డాక్టర్లు, మెడికల్ డైరెక్టర్ లేకపోవడం, చట్టానికి విరుద్ధంగా అబార్షన్లు చేయడం, అగ్నిమాపక పరికరాలు, సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లేకపోవడం, ఫార్మసీ ధ్రువపత్రాలు లేకపోవడమేగాక, అనధికారికంగా అల్ట్రాసౌండ్ ఇతర వైద్య పరికరాలను ఉపయోగించడం, అం దులో పనిచేసేవారి విద్యార్హతలు తప్పుగా చూయించడం తదితర ఉల్లంఘనలు అధికారుల విచారణలో బయటపడ్డా యి.

వీటిపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని యాజమా న్యానికి షోకాజ్ నోటీసు జారీచేయగా వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో తాజాగా ఆ ఆస్పత్రి గుర్తింపును రద్దు చేశా రు. ఆస్పత్రి నిర్వహించకూడదని మేనేజింగ్ డైరెక్టర్, మెడికల్ డైరెక్టర్‌ను ఆదేశించారు.

ఈ ఆదేశా లు అమలు చేయకుంటే తెలంగాణ రాష్ట్ర అల్లోపతి ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్  చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఆ భవనంలో ఆస్పత్రి నిర్వహించకూడదని యాజమానికి సూచించారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.